PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో కిశోరబాలికల ‘స్వేచ్ఛ’ పథకానికి సీఎం జగన్​ శ్రీకారం!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్ ‘స్వేచ్చ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈమేరకు మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో మహిళలు, కిశోర భాలికల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్​ ప్రారంభించారు. ముఖ్యంగా విద్యార్థునులు ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవడంతోపాటు విద్యకు దూరం కాకుండా ఉండే లక్ష్యంతో ప్రభుత్వం స్వేచ్ఛ పథకాన్ని రూపొందించింది. 7–12తరగతుల విద్యార్థునుల రుతుక్రమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని శానిటరీ న్యాప్​కిన్ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా నాప్​కిన్లు పంపిణీ చేయడం జరుగుతుందని జగన్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10,388పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థునులకు శానిటరీ నాప్​కిన్​లు పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా ఆయా జిల్లాల ఆసరా విభాగం జాయింట్​ కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్​ఎంలు భాలికలకు అవగాహన కల్పిస్తారు. స్వేచ్ఛ పథకం అమలుపై నోడల్​ అధికారిగా మహళా టీచర్లను నియమిస్తారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల మహిళలకు వైఎస్​ఆర్​ చేయూత స్టోర్లలో శానిటరీ నాప్​కీన్లను తక్కువ ధరకే అందుబాటులో ఉంచుతారు. కార్యక్రమంలో విద్య, వైద్య ఆరోగ్య, స్త్రీ,శిశుసంక్షేమ శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

About Author