NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళిత బాంధవుడు సీఎం జగన్.. మంత్రి మేరుగ నాగార్జున

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: దళిత బాంధవుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై చాలా దాడులు మర్డర్లు జరిగాయని ఇప్పుడేమో చంద్రబాబు దళితుల ఓట్ల కోసం కపట ప్రేమను చూపుతూ కపట మాటలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎన్ని జన్మలు ఎత్తినా దళితులు నమ్మే స్థితిలో లేరని క్రిస్టియన్ మరియు మైనారిటీలకు అన్యాయం చేశారని క్రిస్టియన్ ఆస్తులను అన్యాక్రాంతం చేశారని రాష్ట్రంలో ఉన్న దళితులు మరియు క్రిస్టియన్లు జగన్ సంక్షేమ పథకాలకు అభివృద్ధి బాటలో ఉన్నారని పాస్టర్లకు ఉపకార వేతనాలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని జగన్మోహన్ రెడ్డి వెంటే దళిత ప్రజలు ఉన్నారని మంత్రి అన్నారు.ముందుగా నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామానికి చెందిన రాష్ట్ర వైయస్సార్సీపి ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి  యాట ఓబులేష్ తన వర్గంతో కలిసి కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో పూల బోకేతో ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author