దేశానికే ఆదర్శం సీఎం జగన్..!
1 min read– నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు ,వెబ్ నందికొట్కూరు: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు.గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని గురువారం నందికొట్కూరు మున్సిపాలిటీ లోని ఇందిరానగర్ 8 వ సచివాలయ పరిధిలోని 23వ వార్డు సీఎస్ఐ పాలేం కాలనీ లో వైసిపి నాయకులు సంగేము సుధాకర్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆర్థర్ కు పూల వర్షం తో ఘనంగా స్వాగతం పలికారు.గడపగడప లో భాగంగా ఎమ్మెల్యే ఇల్లు ఇల్లు తిరిగి పథకాల అమలును వివరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ,అభివృద్ధి పథకాలను వివరిస్తూ, అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందనివారికి పథకాలు అందేలా అధికారులును ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పాలనకు ప్రజలు వంద శాతం మార్కులు వేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాలు, దానికి అనుసంధానం గా వాలంటీర్ల వ్యవస్థల్ని తెచ్చి పరిపాలన ప్రజల ముంగిట నిలిపిన ఘనత జగనన్నదే అన్నారు. నవరత్నాలు అమలు, నాడు నేడు పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రభుత్వ చిత్తశుద్ధి ని తెలియచేస్తున్నాయన్నారు. మేనిఫెస్టోని చెప్పింది చెప్పినట్టు అమలు చేయడం ఒక చరిత్ర అని అన్నారు. జగనన్న ను మళ్లీ మళ్లీ ఆశీర్వదించడానికి గడప గడప సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం పలువురు మహిళలు, కాలనీ ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు .కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బానీ,కౌన్సిలరు ఉండవల్లి ధర్మా రెడ్డి, ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ షూకురు, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ ఉసేనయ్య , సీడీపీఓ కోటేశ్వరమ్మ , మండల వ్యవసాయ అధికారి శ్రావణి,మండల విద్యా శాఖ అధికారి ఫైజున్నిసా బేగం,మున్సిపల్ డీఈ నాయబ్ రసూల్, ఏఈ భాను ప్రతాప్, మున్సిపల్ ఆర్ ఓ విజయ లక్ష్మి, టిపిఓ బాల మద్దయ్య ,సిఐ విజయ భాస్కర్,మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి,మేక్మా ఏపీఎం శాంత కుమారి , వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్, పేరుమాళ్ళ జాన్,సంగెము భాస్కర్, కదిరి సుబ్బన్న ,దామగట్ల రత్నమయ్య,మహిళ నాయకురాలు వనజ, తదితరులు పాల్గొన్నారు.