PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదింటి పెద్ద కొడుకు సీఎం జగన్

1 min read

అవ్వా తాతల ఆనందమే ప్రభుత్వ లక్ష్యం

రూ .2750 నుంచి రూ. 3 వేలుకు  పెన్షన్ ను పెంచి మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..

నందికొట్కూరులో పింఛన్ల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేదింటి పెద్దకొడుకు సీఎం జగన్ అని అవ్వా తాతల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల లో భాగంగా నందికొట్కూరు పట్టణం లోని జై కిసాన్ పార్క్ లో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , నందికొట్కూరు మండల జెడ్పీటీసీ కలిమున్నీసా, నందికొట్కూరు మండల ఎంపీపీ మురళి కృష్ణ రెడ్డి , మున్సిపల్ కమీషనర్ కిషోర్ , ఎంపీడీఓ శోభ రాణి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా  చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి  మాట్లాడుతూ   మలిసందెలో ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒకరు చవిపోతే కానీ మరోకరికి పేన్షన్ ఇచ్చేవారుకాదన్నారు. మహనేత వైఎస్ఆర్ సాచురేషన్ పద్ధతిలో అర్హులైన వారందరి పేన్షన్లు మంజూరు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరానికి రూ. 250  పెంచుతూ నేటికి రూ. 3 వేలు అందించి మాట నిలబెట్టుకున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాష్ట్రంలో 39లక్షల పెన్షన్లకు రూ. 400 కోట్లు  మాత్రమే అందించేవారని ,సీఎం జగన్ ఇప్పుడు  66.34 లక్షల మందికి పెన్షన్లను ఇస్తున్నారని, నెలకు రూ 1900కోట్లు  పెన్షన్లు రూపంలో అందిస్తున్నారన్నారు. ఏడాదికి పెన్షన్ల రూపంలో రూ 23,556 కోట్లను, అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం రూ. 83,256 కోట్లు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ, పీజు రీయంబర్స్ మెంట్,ఉచిత విద్యుత్, 108,104 పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.జగన్ పాలనలో సచివాలయం, వాలంటరీ వ్యవస్థలు ,అమ్మఒడి,డ్వాక్రా రుణమాఫీ, చేయూత,రైతు బరోసా తదితర పథకాలును పెట్టి నేరుగా ప్రజల ఖాతాలలో జమ చేస్తున్నారన్నారు. వందలాది రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులును అందించామన్నారు.జగనన్న కాలనీలను ఏర్పాటు, నూతన పక్కా గృహాలు ను మంజూరు చేయించామన్నారు. నూతన సంవత్సర సందర్భంగ పెన్షన్ల పెంపు నూతన పెన్షన్లు అందుతుండడం సంతోషంగా ఉందన్నారు.భూమిలేని పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అసైన్ మెంట్ భూములు, ఇనాం భూములు, 2003 కు ముందు డి కె టి పట్టాలు, చుక్కల భూముల సమస్యలను  సీఎం జగన్ పరిష్కరిస్తున్నారన్నారు.రాబోయే ఎన్నికల్లో మరో సారి ఓటు వేసి ప్రజలందరికీ  ఇంకా మంచి చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి కి ఇవ్వాలనికోరారు. అనంతరం పెన్షన్ లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చిత్ర పటానికి పాలాభిషేకం చేసి పెన్షన్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జీసీఎస్ కన్వీనర్ అబ్బుబక్కర్ , మున్సిపల్ కౌన్సిలర్లు అబ్దుల్ రావూఫ్, చాంద్ బాషా, హమీద్, సుమలత, అల్లూరి కృష్ణ, నయుబ్, వార్డు ఇంచార్జ్ లు వీఆర్ శీను, రమేష్, కురువ శీను, సన అబ్దుల్లా, ఆర్ట్ శీను, సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

About Author