PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి

1 min read

– టిఎన్ఎస్ఎఫ్ మండల కార్యదర్శి మల్లికార్జున

పల్లెవెలుగు వెబ్ హోళగుంద: ఈ రోజు హొళగుంద పార్టీ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ నిర్వహించిన పత్రిక సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ మండల కార్యదర్శి మల్లికార్జున గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు నడి రోడ్డు మీద పడ్డారని గత ప్రభుత్వ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఏటా లక్షల మందిని దూరం చేస్తూ నేడు 8 లక్షల మందికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తూ లక్షలాది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య ను అందిస్తూ మేన మామ గా ఉంటానన్న జగన్ మోహన్ రెడ్డి కంస మామా అయ్యారని విద్యా వ్యవస్థ ను బ్రష్టు పట్టిస్తు విద్యార్థులకు విద్యను దూరం చేశారని మండి పడ్డారు.ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ను నిర్వీర్యం.పాఠశాలల విలీన ప్రక్రియ, జీఓ 77 ను రద్దు చేసి ఉన్నత విద్యకు దూరం చేశారని.ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని యువత ను నట్టేట ముంచారు అను దుయ్య బట్టారు.ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని లేని పక్షం లో విద్యార్థులే ప్రజా ఉద్యమాల ద్వారా ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించుతారని హెచ్చరించారు.

About Author