NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామ స్వరాజ్యమే సీఎం జగన్ మోహన్ రెడ్డి ధ్యేయం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి    ఏర్పాటు చేసిన గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ చారిత్రాత్మకంగా నిలుస్తోందని  గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.పాములపాడు మండలం జూటూరు గ్రామంలో గడప-గడపకు మన ప్రభుత్వం  నిధుల ద్వారా  రూ. 20 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, రూ. 4.60 లక్షల ఎంపీపీ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన  మంచినీటి బోరు  సౌకర్య మును  బుధవారం  నందికొట్కూరు  శాసనసభ్యులు తొగురు ఆర్థర్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుచున్న సచివాలయ వ్యవస్థ  ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. నిర్దేశిత సమయం కన్నా ముందుగానే ప్రజలకు సేవలు అందుతున్నాయన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సీఎం గా జగన్  అభివృద్ధి, సంక్షేమ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.రెండు పేజీల మ్యానిఫెస్టో లోని హామీలను మూడన్నరేళ్ల  పాలనలో99 శాతానికి పైగా హామీలను నెరవేర్చారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతన్నల సంక్షేమానికి కృషి చేశారని, వారి తనయుడు సీఎం జగన్ అదే బాటలో పయనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  నాయిని సావిత్రమ్మ , రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్  రామ సుబ్బయ్య , ఎంపీపీ  తొగురు సరోజినీ వర్జీనియా ,వైస్ ఎంపీపీ  బండ్లమూరి  వెంకటేశ్వర్లు , ఎంపీటీసీ దర్గమ్మ బాయి , మండల వైసీపీ నాయకులు యం. వెంకట రమణారెడ్డి , వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గ్రంధి పీరయ్య , మండల కో ఆప్టెడ్ మెంబర్  ముర్తుజావలి ,  గ్రామ వైసీపీ నాయకులు రామస్వామి, మద్దిలేటి, మధు, వెంకట రమణ, తిరుపతయ్య, ఉపేంద్ర, ఆచారి, వెంపెంట సర్పంచ్  మాణిక్యమ్మ , ఇష్కాల సర్పంచ్  మౌలాలి , రుద్రవరం సర్పంచ్  రామస్వామి , చెలిమిల్ల సర్పంచ్  కోట్ల. చంద్రా రెడ్డి , వైసీపీ నాయకులు బాలీస్వర్ రెడ్డి, మురహరి.రాజన్న, శెట్టి శివలింగం, షేక్షావలి, స్వామిదాసు, మాలిక్ భాష, దానమయ్య, రామలింగేశ్వర రెడ్డి, చాంద్ భాష,  మండల తహసీల్దార్  రత్న రాధిక , మండల అభివృద్ధి అధికారి  గోపి కృష్ణ , పీఆర్ డిఈ  ధని బాబు ,ఏఈ  రాఘవేంద్ర ప్రసాద్ , వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author