కారుణ్యంపై సీఎం జగన్ కరుణ!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: ఏపీ సీఎం జగన్ కారుణ్య నియామకాలపై కరుణ చూపారు. కరోనాతో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యగో అవకాశం కలిపంచేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు నవంబర్ 30నాటికి రాష్ట్రంలో కారుణ్య నియామకాలు పూర్త చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) శశి భూషణ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, కోవిడ్ టాస్క్‌పోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టి కృష్ణబాబు, 104 కాల్‌సెంటర్ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.