ఇంద్రకిలాద్రి దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ
1 min read
పల్లెవెలుగువెబ్, విజయవాడ: ఇంద్రకిలాద్రిపై జరుగుతోన్న దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి జన్మనక్ష్రతం(మూల నక్షత్రం) రోజున ఏపీ సీఎం వైఎస్.జగన్ మంగళవారం దుర్గమ్మ ప్రభుత్వ పట్టువస్త్రాలను లాంఛనంగా సమర్పించారు. ముందుగా పట్టువస్త్రాలకు ఇచ్చేందుకు సీఎం జగన్కు రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు సీఎం. జగన్కు తలపాగా చుట్టగా ప్రభుత్వ లాంఛనాలతో దుర్గామల్లేశ్వరస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించాక దేవస్థానం అధికారులు సీఎంజగన్ను ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞపికలతో ఘనంగా సత్కరించారు.