PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్​! పలుప్రారంభోత్సవాలు

1 min read

పల్లెవెలుగువెబ్​, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతోన్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి సీఎం జగన్​ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జరిగే గరుడ వాహనసేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈక్రమంలో శ్రీవారికి గరుడ వాహన జరిగే సోమవారం రోజున సీఎం జగన్​ ప్రభుత్వ లాంఛనాలతో సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా సీఎం జగన్​కు అర్చకస్వాములు పరిపట్టం ధరింపజేశారు. అనంతరం పట్టువస్త్రాలను శిరస్సున ధరించిన జగన్​ మేళతాళాల నుడమ శ్రీవారి ఆలయానికి వెళ్లి సమర్పించారు. అనంతరం గరుడవాహనసేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం వెంట రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్​, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలినాని, నారాయణస్వామి, తితిదే చైర్మన్​ వైవీ.సుబ్బారెడ్డి, ఈవో జవహర్​రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు సీఎం జగన్​ తిరుమలలోని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈమేరకు అలిపిరి శ్రీవారి పాదాల చెంత రూ.15కోట్ల వ్యయంతో నిర్మించిన సప్తగోప్రదక్షిణ మందిరాన్ని జగన్​ ప్రారంభించారు. అలాగే అలిపిరి నడకమార్గానికి ఏర్పాటు చేసిన పైపును ప్రారంభించారు. తదుపరి శ్రీవారి బ్రహ్మోత్సవ సేవల్లో పాల్గొన్నారు. కాగా సోమవారం మధాహ్నం తిరుపతిలోని టీటీడీ బర్డ్​ వైద్యశాలలో శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల విభాగాన్ని సీఎం జగన్​ ప్రారంభించారు.

About Author