NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కృష్ణా ప్రాజెక్టులపై సీఎం జగన్​ సమీక్ష!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న పలు ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై సీఎంజగన్​ శుక్రవారం క్యాంప్​ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సకాలంలో పూర్తయ్యేందుకు నిర్మాణ ప్రణాళికలను సమగ్రంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయమై ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రిత్వశాఖతో చర్చిస్తుండాలని ఇరిగేషన్ శాఖకు సూచించారు. కాపర్​డ్యాం పనులు సకాలంలో పూర్తి చేసి ఖరీఫ్​లో రైతులుకు నీరు అందిస్తామని ఇరిగేషన్​ అధికారులు వెల్లడించారు. అలాగే 2022 ఆగస్టు నాటికి అవుకు రిజర్వాయర్​ పనులు పూర్త చేస్తామని చెప్పారు. వంశధార పనులు సైతం నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎంజగన్​ ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్​కుమార్​, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About Author