రేపు దుర్గమ్మకు పట్టువస్త్రాలు ఇవ్వనున్న సీఎం జగన్!
1 min read
పల్లెవెలుగువెబ్, విజయవాడ: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకిలాద్రిపై దేవీశరన్నవరాత్రోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ 12వ తేదీ మంగళవారం దుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈమేరకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు తిరుమలలో ప్రకటించారు. మంగళవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3గంటలకు దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.