వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
1 min read
పల్లెవెలుగువెబ్ : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం చేపట్టిన ఇరిగేషన్ రివ్యూ సందర్భంగా.. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో గోదావరి వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారుల నుంచి సీఎం జగన్.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే 48 గంటల్లో వరదనీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు, సీఎం జగన్‌కు తెలిపారు.