PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇతర రాష్ట్రాలకు సీఎం జగనన్న పరిపాలన ఆదర్శంగా నిలిచింది

1 min read

కారుమంచి గ్రామ నూతన సచివాలయం ప్రారంభం చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం

నూతన రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన మంత్రి గుమ్మనూరు

గ్రామంలో 10లక్షలు రూపాయలుతో సీసీ రోడ్డు కోసం భూమి పూజ చేసిన మంత్రి గుమ్మనూరు

సంక్షేమ పథకాలు మరియు గ్రామంలో అభివృద్ధి పనులు మన ప్రభుత్వం 26కోట్ల 90లక్షలు రూపాయలుతో అభివృద్ధి చేయడం జరిగింది.

గ్రామంలో మరో 20లక్షలు రూపాయలుతో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి

నూతన సచివాలయం కోసం స్థలము దాత జోగి రంగన్నను అభినందించిన మంత్రి గుమ్మనూరు

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం

పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆదర్శం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.శుక్రవారం ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం,రైతు భరోసా కేంద్రం,సీసీ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రివర్యులకి నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసమే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు.  వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రైతులకు సరైన సూచనలు సహకారాలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సహాయంగా 13 వేల రూపాయలు అందచేసి, కొన్ని పరిస్థితుల్లో పంట నష్టం వస్తే పంటల భీమ ద్వారా పరిహారాన్ని అందజేస్తుందన్నారు ఈ విధంగా వ్యవసాయ రంగాల్లో అన్ని విధాలుగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తోడు ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో, ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై మంత్రి  ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అనంతరం మంత్రివర్యులు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయాలని అన్నారు.గ్రామాల్లో సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.26 కోట్ల 90 లక్షలు అర్హులైన వారకి లబ్ధి చేకూరిందన్నారు. గ్రామములో మరో రూ. 20 లక్షల నిధులతో  మౌలిక సదుపాయాల కొరకు డ్రైనేజీ, రోడ్లు, పనులు కొరకు ప్రణాళికలు సిద్ధంచేసిపనులు ప్రారంభించాలన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు, కారుమంచి సర్పంచ్ లక్ష్మీ, ఆస్పరి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, ఆస్పరి ఎంపీపీ సుంకర రామాంజనేయులు, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ ములింటి రాఘవేంద్ర, మండల జెసిఎస్ కన్వీనర్ బసవరాజు, ఆస్పరి సొసైటీ సీఈవో అశోక్, వైస్ ఎంపీపీ రాజన్న గౌడ్, మండల కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి,ఆస్పరి ఎంపీటీసీలు తిమ్మప్ప, ప్రకాష్, కౌలిట్ల, కృష్ణ రెడ్డి,నాయుడు, వేణు,రాధాకృష్ణ,హరి కృష్ణ, వీరభద్రి,విజయ్ కుమార్, వెంకప్ప,చంద్ర, మనోహర్ రెడ్డి, చెన్నప్ప,ఆంజనేయ, ప్రభాకర్ యాదవ్,మేఘనాథ్,కన్నా, యల్లప్ప,రంగన్న, శ్రీరాములు,ఏర్రిస్వామీ,శివ, లక్షన్న ,శేఖర్ తదితర వైకాపా నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author