PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జడ్పీ చైర్మన్ ఆధ్వర్యం లో  సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

1 min read

పాల్గొన్న హోం మంత్రి తానేటి వనిత, మాజీ డిప్యూటీ సిఎం ఆళ్ళ నానీ, జడ్పీ చైర్మన్ పద్మశ్రీ

మేయర్ షేక్ నూర్జహాన్,

ఏలూరులోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు

ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన హోంమంత్రి తానేటివనిత…

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : డా. బి. ఆర్.  అంబేద్కర్ కలలుగన్న సంక్షేమ పాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గత  నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి శ్రీమతి తానేటి వనిత అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తో కలిసి    కేక్ కట్ చేసి ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నిరుపేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు.  సమాజంలోని అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని, ప్రజలు జగన్మోహన్ రెడ్డి పై పెట్టుకున్న నమ్మకాన్ని ముఖమంత్రి నిలబెట్టుకున్నారన్నారు.    ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ పధకాలు కొనసాగాలంటే  జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ  ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించాలన్నారు.

           జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల ఆర్ధిక, సామజిక, రాజకీయాభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  పెద్దపీట వేస్తున్నామన్నారు.మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)  మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి  గాడిలో  పెట్టారన్నారు. ప్రజల నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా  సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి ఎంతగానో కృషిచేస్తున్నారని,  సంక్షేమ పధకాలను మహిళల పేరుమీదే మంజూరు చేస్తున్నారని, మహిళలు  ఆర్ధికంగా, రాజీకీయంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంతి అధిక ప్రాధాన్యత ఇచ్చి పదవుల కేటాయింపులలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి ఈ ఓ  కె. సుబ్బారావు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author