కోనసీమలో సీఎం జగన్ పర్యటన
1 min read
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. తర్వాత అరిగెలవారిపేట, ఉడిమూడిలంక చేరుకుని వరద బాధితులతో మాట్లాడతారు.