రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో రోశయ్య నివాసానికి కేసీఆర్ వెళ్లారు. రోశయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోశయ్య మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించింది. మూడురోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా చేశాం : మోదీ
కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను, రోశయ్య ఒకేసారి సీఎంలుగా చేశామని నరేంద్రమోదీ తెలిపారు. తమిళనాడు గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయనతో మంచి అనుభందం ఉండేదని గుర్తుచేసుకున్నారు.