PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం కేసీఆర్ పర్యటన… బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:   సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన. జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS: నారాయణపేట జిల్లాలో నవంబరు 06వ తేదీన నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు  పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్  సీఎం  పర్యటన సందర్భంగా సభాస్థలి, గ్యాలరీలు, ఎలిప్యాడ్ మొదలగునవి  ఏర్పాటు చేసే స్థలాలను, పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ డైవర్షన్ మొదలగు ఏర్పాట్లను పరిశీలించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భారీ కేట్స్, తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్  పర్యటన సందర్భంగా జిల్లాలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ  తెలిపారు. ఎస్పీతో పాటు డిఎస్పీలు కే సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సిఐ లు రవి బాబు, రామ్ లాల్, SI లు విజయ్ కుమార్, పర్వతాలు తది తరులు ఉన్నారు.

About Author