PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

1 min read

కులం చూడం మతం చూడం పార్టీలకు అతీతంగా సంక్షేమ అందిస్తాం

7లక్షల 75వేల రూ చెక్కులను అందించిన కర్నూలు వైస్సార్సీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  అన్నారు. కర్నూలు నగరంలోని ఎమ్మెల్యే  కార్యాలయం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను పంపిణీ చేశారు. 7లక్షల 75వేల రూపాయల చెక్ లను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 3వేలు పైగా వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా వుందంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వానికి కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author