అర్హులైన ప్రతి ఒక్కరికీ..సీఎం సహాయ నిధి
1 min read
ఇండ్లకు వెళ్లి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జయసూర్య..
నందికొట్కూరు, న్యూస్ నేడు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధిఅందిస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని రుద్రవరం, లింగాల,మద్దూరు, పాములపాడు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎమ్మెల్యే జయసూర్య సీఎం ఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తూ వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గురించి ఏ విధంగా ప్రభుత్వ పాలన ఉందని మీ ఇంటికే వచ్చి మీకు చెక్కులు అందజేస్తున్నామని ఈ ప్రభుత్వంపై మీ దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే వారిని కోరారు.రుద్రవరం గ్రామానికి చెందిన ఈడిగ నాగ లింగన్న కు 3,04,484 రూపాయల చెక్కు,పాములపాడు గాండ్ల మహానంది,లక్ష్మీదేవికి 6,20,800 రూపాయల చెక్కు, లింగాలకు చెందిన పూజల స్వాములు 48,245..మద్దూరు కు చెందిన సుచిత్రకు 40 వేలు, జడల్ నాయక్ కు 20,524 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే మరియు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి చెక్కులను అందజేశారు.లబ్ధిదారులు మరియు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు మరియు సురేంద్ర నాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రవీంద్రారెడ్డి, తిమ్మారెడ్డి,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్,క్లస్టర్ ఇంచార్జ్ చంద్రశేఖర్, లక్ష్మీకాంత రెడ్డి,టేకూరి రామ సుబ్బమ్మ,ఆదిరెడ్డి,మోహన్ గౌడ్,సర్పంచ్ మాణిక్యమ్మ,నాగేశ్వరావు, లింగేష్ గౌడ్,వినయ్, రాజేష్,లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.