PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం సహాయనిధి కింద రూ 9లక్షల 50 వేల రూ. మంజూరు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి”  ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద రూ. 9,50,000/- లక్షల చెక్కులు మంజూరైనట్లు మన ప్రియతమ నాయకురాలు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “బుట్టా రేణుక” గారు తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం (శిల్పా ఎస్టేట్) నందు లబ్ధిదారులకు చెక్కులను మన ప్రియతమ నాయకురాలు, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి “బుట్టా రేణుక” గారి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. లబ్దిదారుల సహాయనిధి గొల్ల హరిత రూ. 30,000/-, చాకలి శీరిష రూ. 100,000/-, మందుల రవి రూ. 3,00,000/-, వడ్డె పద్మ  రూ. 90,000/-, జయరామి రెడ్డి రూ. 1,30,000/-, సోమిరెడ్డి రూ. 3,00,000/- తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. దీంతో ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలసి సమస్యను ఆయన దృష్టికి తీసుకునివెళ్లగా వెంటనే చెక్కులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, మండల & పట్టణ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

About Author