NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీఆర్సీ పై సీఎం స‌మీక్ష‌.. రెండ్రోజుల్లో ఫిట్ మెంట్ ?

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ఉద్యోగ సంఘాల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో .. వారి స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ప్రభుత్వం స‌త్వర చర్యలు చేప‌ట్టింది. ఆర్థిక శాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వహించారు. ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ పై క‌మిటీ ఇచ్చిన నివేదిక పై ప్రధానంగా చ‌ర్చ జ‌రిగింది. క‌మిటీ సిఫార‌సుల‌ను ప‌రిశీలించిన సీఎం .. ఎంత‌మేర వేతనాలు పెంచాల‌నే అంశం పై స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. ప్రస్తుత ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఎంతమేర ఫిట్ మెంట్ ఇవ్వడం సాధ్యమ‌వుతుంద‌న్న అంశం పై చ‌ర్చ జ‌రిగింది. ఉద్యోగుల‌కు ఇప్పటికే 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఇస్తుండ‌గా.. ఎంత మేర ఫిట్ మెంట్ పెంచితే బ‌డ్జెట్ పై ఎంత భారం ప‌డుతుంద‌న్న విష‌యాన్ని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. రెండ్రోజుల్లో ఫిట్ మెంట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

About Author