సీఎం సభను విజయవంతం చేయాలి..
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: నెల 17వ తేదీ ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించనున్న సీఎం సభను విజయవంతం చేయాలని తహాశీల్దార్ వెంకటశివ ఎంపీడీవో మధుసూదనరెడ్డి అధికారులు సిబ్బందికి సూచించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహాశీల్దార్ వెంకటశివ మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 17వ తేదీ సోమవారం ఆళ్లగడ్డకు విచ్చేయుచున్నాడన్నారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఏర్పాట్లు రైతులను తరలించే విధివిధానాలపై నంద్యాల జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరించడం జరిగిందన్నారు. తహాశీల్దార్ ఎంపీడీవో వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఐకెపి సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది ఉపాధి సిబ్బందిని మండల కమిటీలు విలేజ్ కమిటీలుగా ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ అధికారులు మండలంలోని రైతుల వివరాలను మండల కమిటీలకు అందజేస్తే సీఎం సభకు రైతులను తరలించేందుకు విలేజ్ కమిటీలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు తద్వారా గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులను సభకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సచివాలయాల పరిధిలో రైతులను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు మండల విలేజ్ కమిటీలు బాధ్యతలు తీసుకోవాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఐకెపి సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.