సీఎం స్టాలిన్.. మీ తీరు అభినందనీయం : పవన్
1 min read
పల్లెవెలుగు వెబ్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన వ్యవహరిస్తున్న తీరును పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదన్న విషయాన్ని మాటల్లో కాకుండా.. చేతల్లో చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. స్టాలిన్ పరిపాలన, ప్రభుత్వ పనితీరు దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం, స్పూర్తిదాయకమని అన్నారు. సీఎం స్టాలిన్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.