సీఎం యడ్యూరప్ప రాజీనామా.. కంటతడి !
1 min readపల్లెవెలుగు వెబ్ : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. అధిష్టానం ఆదేశాలతో సీఎం పదవికి రాజీనామ చేశారు. గవర్నర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామాపత్రం సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లు పూర్తైన రోజునే యడ్యూరప్ప రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం యడ్యూరప్ప తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. అయినా రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని తెలిపారు. సీఎంగా యడ్యూరప్ప రాజీనామాతో కర్ణాటకలో తదుపరి సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ్ బొమ్మై పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు. బీజేపీ ఓటు బ్యాంకులో లింగాయత్ సామాజికవర్గానిదే సింహభాగం. దీంతో తదుపరి సీఎం ఎవరైనా సరే లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారన్న ప్రచారం సాగుతోంది.