PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం మైనార్టీల పక్షపాతి సీఎం వైయస్ జగన్

1 min read

– ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులకు జగనన్న ఆర్ధిక సహాయం 

– కమలాపురం నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ముస్లిం మైనార్టీల పక్షపాతిగా అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కమలాపురం నియోజకవర్గం ముస్లిం మైనార్టీల కన్వీనర్ అన్వర్ భాష అన్నారు, మంగళవారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండి పవిత్ర హజ్ యాత్ర చేయు ప్రత్యేకించి గన్నవరం, విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ నుండి బయలుదేరు 1813 మంది యాత్రికులకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాసటగా నిలవడం జరిగిందన్నారు, విమాన టికెట్టు పై, ప్రతి యాత్రికునిపై రూ.80, వేల రూపాయలు అదనపు భారం పడుతుందని ఆందోళన చెందుచుండగా,  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, పవిత్ర హజ్ యాత్ర చేయు యాత్రికుల సహాయార్థం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రులతో సంప్రదింపులు జరిపి, హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కెషన్ పాయింట్ ల టికెట్ ధరలతో సమానంగా విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ కు టికెట్ ధర నిర్ణయించాలని కోరినప్పటికీ, అయితే సాంకేతిక కారణాల వలన ఆయా మంత్రిత్వ శాఖలు తమ నిస్సహాయతను ప్రకటించడంతో, విషయం తెలుసుకున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి   వెంటనే స్పందిస్తూ, ఆ అదనపు భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఎట్టి పరిస్థితులలో కూడా యాత్రికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు, ముస్లిం మైనార్టీలకు తానిచ్చిన మాటకు కట్టుబడి,  ప్రభుత్వ ఉత్తర్వులు జి. ఓ. ఆర్. టి. నెం.114, మైనార్టీస్ వెల్ఫేర్ (ఓ. పి. &బడ్జెట్) డిపార్ట్మెంట్, తేది:15.05.2023న రూ.14.51 కోట్లు ఆర్థిక సహాయం విడుదల చేసి, మరొక్క సారి తాను ముస్లిం మైనార్టీల పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆయన తెలియజేశారు, ఈ మొత్తాన్ని, గన్నవరం ,విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు బయలుదేరు 1813 మంది యాత్రికులకు సంబంధించి,  సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు వారు చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా సెంట్రల్ హజ్ కమిటీకి  చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు,దేశంలో ఎంబార్కెషన్ పాయింట్ ల వారీగా, పది రాష్ట్రాలలో టికెట్ ధరల విషయంలో ఆయా రాష్ట్రాల హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడుతున్నదని. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిర్ణయించిన ధరల మేరకు, యత్రికులపై పడిన అదనపు ఆర్థిక భారాన్ని, దేశంలో, కేవలం, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తున్నదన్న విషయాన్ని ముస్లిం మైనార్టీ ప్రజలు గమనించాలని కోరుచున్నట్లు ఆయన తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ భాషకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మునీర్ అహ్మద్, అబ్దుల్ రబ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, కరీం, తదితరులు పాల్గొన్నారు.

About Author