అర్హులకు సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం ధ్యేయం..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : వందశాతం అర్హులకు సంక్షేమ పథకాలు అందచేసేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ సచివాలయం పరిధిలో మున్సిపల్ కమీషనర్ పి.కిషోర్ ఆధ్వర్యంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, సచివాలయ జె.సి.యస్ కన్వీనర్ అబూబక్కర్ , కౌన్సిలర్ లు కొండ్రెడ్డి విజయమ్మ , చింతా లక్ష్మిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం సాగుతోందన్నారు. ప్రభుత్వం తరపున వలంటీర్లు ఇంటికే వచ్చి ఏవైనా సమస్యలున్నాయా సర్టిఫికెట్లు కావాలా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని తెలుసుకోవడం తొలిసారిగా చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వాలంటీర్లు, గృహసారథులు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలందించేందుకు జల్లెడ పడుతుండగా.. మరో పక్క క్యాంపుల ద్వారా అక్కడికక్కడే అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేసే కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రికార్డు స్థాయిలో సమస్యలను పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందన్నారు. అర్హత ఉండీ కూడా ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరూ ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ చార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందిస్తోందన్నారు.ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని, జగనన్న ప్రభుత్వంలో ఏ పని అయినా సులభంగా పూర్తవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ లు రజిని కుమార్ రెడ్డి, సప్లయర్ సత్యనారాయణ, వి.ఆర్ శ్రీను, ఆర్.ఐ శ్యామలాదేవి, ఎలక్షన్ డి.టి కిషోర్, మున్సిపల్ ఆర్.ఐ విక్రమ్ మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.