PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం పర్యటన బహిరంగ సభ కు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలి..

1 min read

యావన్మందికి బ్రీఫింగ్ కార్యక్రమం..

సభలో ఏ ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యంగా పోలీసులపై ఉంది..

ట్రాఫిక్ నియంత్రణకు ఏ ఇబ్బంది కలగకుండా బందోబస్తు డ్యూటీలు

జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఏలూరు మల్కాపురం గ్రామంలో బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో సిబ్బంది యావన్మందికి ఏలూరు జిల్లా ఎస్పీ  మేరీ ప్రశాంతి ఐపీఎస్ బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ సభా ప్రాంగణంలో ప్రజలుకు ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యంగా పోలీసు అధికారులు పై ఉన్నదని రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా బందోబస్తు డ్యూటీలను నిర్వర్తించాలని,వాహనాలలో వచ్చే ప్రజలను సక్రమమైన మార్గాలలో సభాస్తాలకి చేరుకునేలాగా తగిన చర్యలు తీసుకోవాలని,పోలీసు అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని,వి వి ఐ పి భద్రత కొరకు పోలీస్ అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా ఉద్యోగ నిర్వహణ చేయాలని,సభానంతరం ప్రజలు వారి యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా చేరేలాగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి దశ దిశను నిర్దేశించినారు.ముఖ్యమంత్రివర్యులు పర్యటన నేపథ్యంలో మొత్తం 3298 మంది సిబ్బంది యొక్క సేవలను వినియోగిస్తున్నట్లుఅదనపు ఎస్పీలు ఏడుగురు డిఎస్పీలు 23 సీఐలు 78 ఎస్ఐలు మరియు ఆర్ఎస్ఐలు 197 హెడ్ కానిస్టేబుల్స్ మరియు ఏఎస్ఐ లో 478 మంది పోలీస్ కానిస్టేబుల్స్ 1119 మంది మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ 199 హోంగార్డ్స్ 80 మంది మహిళా హోంగార్డ్స్ 60 మంది ఏఆర్ సిబ్బంది 167 మరియు స్పెషల్ పార్టీ 164 సిబ్బందిని ఈ యొక్క డ్యూటీల కొరకు వినియోగిస్తున్నట్లు గా జిల్లా ఎస్పీ ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియ చేసినారు.

About Author