మున్సిపల్ సమ్మె ఒప్పందాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం
1 min read
అప్కస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మున్సిపల్ కార్యాలయం ధర్నా, మున్సిపల్ కమిషనర్ కి వినతి:
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: పట్టణంలో గత ప్రభుత్వం లో మున్సిపల్ కార్మికులు 17 రోజులపాటు సమ్మెను కొనసాగించడం జరిగిందని, ఆ సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలు చేయడం జరిగిందని, ఆ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలం చెందిందని సోమవారం రోజున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని మున్సిపల్ నాయకులు ఎల్లప్ప,శివ, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మ గురుడు, పట్టణ కార్యదర్శి విజయేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో సమాన పనికి సమాన జీతం, కాంట్రాక్ట్ హౌససోర్సింగ్ ఉద్యోగులు పర్మినెంట్ హామీల అమలు కోసం మున్సిపల్ కార్మికులు దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహించారు. నిర్బంధాలు, అరెస్టులు, అక్రమ కేసులు ఎదుర్కొని మిలిటెంట్ పోరాటాలు నిర్వహించారు. 2023 డిసెంబర్ 26 నుండి 2014 జనవరి 11వ తేదీ వరకు 17 రోజులు చారిత్రాత్మక సమ్మెను నిర్వహించడం జరిగిందని తెలిపారు. నాటి ప్రభుత్వం కార్మికులందరికీ వర్తింపచేసే విధంగారాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఊసులో లేకుండా పోయాయి.రిటైర్మెంట్ బెనిఫిట్లు (10 సంవత్సరాల సర్వీసు ఉంటే రూ.75 వేలుఆ పైన ఏడాదికి రూ.2 వేలు అదనంగా), ప్రమాద బీమా రూ.5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెంపు, దహన సంస్కారాలకు రూ.15 వేల నుండి రూ.20 వేలకు పెంపు, ఇంజనీరింగ్ కార్మికుల జీతాం. పెంపు, సంక్షేమ పధకాలు, పర్మినెంట్ కార్మికులకు సరండర్ లీవ్ లు, జి.పి. ఎస్ అకౌంట్లు తదితర డిమాండ్ల పరిష్కారానికి 2024 జనవరి 24వ తేదీన నాటి ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సిఫార్సు వేసింది. కాగా ఆ తరువాత సాధారణ ఎన్నికలు రావడంతో ఈ పైళ్ల వ్యవహారం మూలన పడింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న మున్సిపల్ కార్మికుల ఫైళ్లన్నింటిని తిరిగి వెనక్కి పంపించింది. దీనితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై మున్సిపల్ కార్మికులు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా అయ్యాయని మున్సిపల్ కార్మికులు ఆందోళన చెప్పడం జరుగుతుంది. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించే అప్కాస్ రద్దుచేసి ప్రవేట్ వ్యక్తుల ఏజెన్సీలకు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని తక్షణమే ఆలోచన విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ నాయకులు నాగప్ప, విక్రమ్ సల్మాన్, లక్ష్మన్న, భీమడు, సోమన్న, ఈరన్న, హనుమప్ప, ఆనంద్, చిన్న రాముడు, రాజు, నిమరోద్, ఖలీల్, శ్రీనివాసులు, ఖాజు, హనుమంత్, తదితరులు పాల్గొన్నారు.