కుప్పకూలిన పాక్ సర్కార్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇమ్రాన్‌ఖాన్ సర్కారు కూలిపోయింది. పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానమే నెగ్గింది. అయితే ఇది అంత సులువుగా జరగలేదు. చివరి బంతి వరకు ఆడతానని ప్రకటించిన ఇమ్రాన్‌ఖాన్.. చెప్పినట్టే చేశారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల్లోగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు ఆయన తిలోదకాలిచ్చారు. అర్ధరాత్రి 12 కావడానికి 25 నిమిషాల ముందు.. పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేశారు. అయితే అప్పటికప్పుడు అయాజ్ సాదిఖ్‌ను యాక్టింగ్ స్పీకర్‌గా ఎన్నుకొని అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ఇమ్రాన్ సర్కారు కీన్‌బౌల్డ్ అయింది. మెజారిటీ ఓట్లను సాధించలేక కుప్పకూలింది. ఇక అంతకుముందు ఉదయం 10.30 గంటల నుంచి అర్ధరాత్రి దాకా వాయిదాల పరంపరతో పాక్ జాతీయ అసెంబ్లీని నెట్టుకొచ్చారు.