శిధిలావస్థలో రామ మందిరం… విరాళాల సేకరణ..
1 min readభక్తులు, దాతలు సహకరించాలని వినతి
విరాళాలు అందించు దాతలు రసీదు పొందగలరు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : భారత దేశ ప్రజల ఆకాంక్ష మేరకు అయోధ్యలో శ్రీ రామ మందిరం నిర్మాణం జరిగి 22.01.2024 న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము జరిగిన సంగతి తెలిసినదే. మన జంగారెడ్డిగూడెం పట్టణం, బుట్టాయి గూడెం రోడ్ లో వేంచేసియున్న శ్రీ సీత రామ స్వామి వారి దేవాలయం మరియు ద్వజస్తంభం శిధిలా వస్థ లో వున్నందున ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారు C.G.F. నిధులు నుండి ఆలయ పునః నిర్మాణమునకు 1 కోటి రూపాయిలు వరకు అంచనా వేసియున్నారు. సదరు అంచనా మొత్తం లో రూ. 66,66,000/- లు C.G.F. నిధుల నుండి మంజూరు అవుటకు శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానము నుండి రూ.33,34,000/- లు మ్యాచింగ్ గ్రాంట్ గా C.G.F. అకౌంట్ నందు జమచేయవలసియున్నది.జంగారెడ్డిగూడెం పట్టణం మరియు పరిసర గ్రామ భక్తులు యావన్మందిని కోరినది. ఏ మనగా శ్రీ సీత రామ స్వామి వారి దేవస్థానం మరియు ద్వజస్తంభం పునః నిర్మాణమునకు తమ వంతుగా విరాళములు అందజేయవలసినదిగా కోరుచున్నాము. సదరు విరాళము యిచ్చు ధాతలు నేరుగా శ్రీ సీత రామ స్వామి వారి దేవస్థానము జంగారెడ్డిగూడెం నందు మరియు గురవాయిగూడెం గ్రామము లో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు విరాళములు అందజేసి తగు రశీదు పొందవలసినదిగా కోరుచున్నాము. నేరుగా విరాళములు అందజేయుట వీలు కానీ వారు జంగారెడ్డి గూడెం పట్టణము నందు యునియన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు Executive Officer, Sri seetharama swami Temple Jangareddigudem A/C No. 025912010001532 IFSC Code UBIN0802590 నందు జమ చేయవలసినదిగా కోరుచున్నాము.మేము ఈ విధముగా కోరిన వెంటనే శ్రీ నడింపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు సతీష్ , దార సత్యనారాయణ ద్వజస్తంభ నిర్మాణము మరియు ప్రతిష్ట కు అయ్యే ఖర్చు ఇరువురు కలిసి తమ సొంత ఖర్చులతో భరిస్తాము అని తెలియజేసారు.కావున భక్తులు దయవుంచి శ్రీ సీత రామ స్వామి వారి పునః నిర్మాణమునకు విరాళములు త్వరితగతిన అందజేయవలసినదిగా కోరుచున్నాము.