చంద్రబాబు బయటకు రావాలని సంతకాల సేకరణ… టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి ఆయన బయటకు రావాలని సంతకాల సేకరణ చేపట్టినట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. నగరంలోని 4వ వార్డు మంగలి వీధిలో ఆయన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. టిడిపి సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేసేందుకు ప్రజల నుండి సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి రాష్ట్రంలో అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు, చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజల దృష్టి మళ్లించాలనుకున్నారని, అరెస్ట్ ద్వారా ఏదో సాధించాలనుకున్న వాళ్లకు చివరికి వారికి వారే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం చంద్రబాబు మీద అనుమానంతో అరెస్టు చేశారన్నారు. ఈ అరెస్టుతో తమకు ఎంతో బలం వచ్చినట్లయిందన్నారు. ప్రజలందరూ ఈ విషయంంలో ఎంతో ఆలోచిస్తున్నారని.. అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారని మహిళలు ఆవేదన చెందుతున్నారన్నారు. చంద్రబాబు నిర్దేశించిన విధంగా కార్యక్రమాలు చేస్తున్నామని.. పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమన్నారు. ప్రజలందరూ ఆలోచించాలన్నారు. చంద్రబాబు ప్రకటించిన మొదటి విడత మేనిఫెస్టోతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఊట్ల రమేష్, చెన్న, సయ్యద్ భాష, జావిద్, నరసింహ, నాగేశ్వరమ్మ, నాగరాజు, భాస్కర్, ఎల్లయ్య, ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.