NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేను సైతం-బాబు కోసం సంతకాల సేకరణ

1 min read

-విజనరీ లీడర్ చంద్రబాబు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం టిడిపి కార్యాలయం దగ్గర టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నేను సైతం-బాబు కోసం లో భాగంగా ప్రజల నుంచి సంతకాలను బోర్డులో చేయించటం ప్రారంభించారు.మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చేంతవరకు మండలంలో ఉన్న ప్రజలతో సంతకాలు చేయిస్తున్నట్లు ఖాతా రమేష్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ లీడర్ అయినందుకే ప్రజల నుండి మద్దతు లభిస్తుందని రాష్ట్ర అభివృద్ధి కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని ప్రజలు బయటకు వచ్చి టిడిపికి సంఘీభావం తెలిపేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారని అలాంటి వాతావరణం మన రాష్ట్రంలో నెలకొని ఉందని ఆయనప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.ఎన్నికల సమయంలో ప్రజలు సరైన విధంగా తీర్పు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.అదేవిధంగా సాయంత్రం  మిడుతూరు మండల కేంద్రం పింజరి పేటలో భవిష్యత్తుతో గ్యారంటీ అనే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ చంద్రబాబు అరెస్టు మరియు ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు ఖాతా రమేష్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్,మండల యువ నాయకులు సుభాన్,జమాల్ భాష,చాంద్ బాష,వెంగల్ రెడ్డి,చిన్న మౌలాలి,పెద్ద మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

About Author