సమష్టి కృషి.. అభినందనీయం
1 min read– ఏడుకేసులు ఛేదించిన పోలీసులు
– ఆరు దేవాలయాలు.. ఒకటి ఇంటి దొంగ చోరీ..
– కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం: కర్నూలు జిల్లాలోని పలు దేవాలయాల్లో జరిగిన చోరీలు, ఓ ఇంటి దొంగకు సంబంధించిన కేసులను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పక్కా ప్రణాళిక.. నిఘానేత్రం సహాయం.. సమష్టి కృషితో ఏడు కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ డా. ఫక్కీరప్ప అభినందించారు. ప్రశంసాపత్రం అందజేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
మూడు చోరీలు..ముగ్గురి అరెస్టు.. ముగ్గురు పరారీ
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 1న రాత్రి తిక్క రాత స్వామి గుడి , అయ్యప్ప స్వామి గుడి , ఎల్లమ్మ తల్లి గుడిలో దొంగతనం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ నందు CR.NO’S 62-2021, 63-2021, 64-2021 U / Sec 457,380 IPC గా కేసులు నమోదు పరచడమైనది. ఈ విషయం పై డోస్ డిఎస్పి వి. నరసింహా రెడ్డి , సిసిఎస్ కర్నూల్ డిఎస్పి ఎ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో, డోన్ రూరల్ సీఐ శ్రీ ఓ. మహేశ్వర రెడ్డి పర్యవేక్షణలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ G. పెద్దయ్య నాయుడు వారి పోలీసు సిబ్బంది కలిసి సదరు కేసులలో దర్యాప్తు బృందాలుగా ఏర్పడ్డారు.
మార్చి 30న కడప జిల్లా దువ్వురు గ్రామానికి చెందిన ఎరుకలి పగిడ్యాల సుబ్బా రాయుడును వెల్దుర్తి మండలం రామళ్లకోటకు వెళ్లేదారిలోని పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న పొలాల్లో అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడు నేరం ఒప్పుకున్నాడు. తనతోపాటు అదే జిల్లా ఒంటి మిట్ట మండలం, కొత్త మాధవరం గ్రామస్తులైన నాగలూరి ఆదినారాయణ, నాగలూరి జానయ్య @ జాని, గుర్నాధం గంగరాజు, నాగలూరి ఎసెబు , గుర్నాధం ఆంజనేయులుతో కలిసి 3 ఆలయాలలో దొంగతనాలు చేసినట్లు ఒప్పకున్నాడు. అతని వద్ద నుండి వెల్దుర్తి గ్రామ శివార్లలో గల ఆలయాలలో దొంగలించిన చోరీ సొమ్ము అయిన రూ. 4 వేలను రికవరీ చేయడమైనది . అతని వద్ద నుండి ఒక పిడి బాకును కూడా స్వాధీన పరచుకోవడమైనది . మిగిలిన ఐదుగురిలో ఆదినారాయణ , జానయ్య @ జాని లను గోనెగండ్ల పోలీసులు వారి పరిధిలో చేసిన నేరంలో అరెస్టు చేసినారు . మిగిలిన ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తాము .
గోనెగండ్లలో.. ఇద్దరి అరెస్టు.. నగదు,బైకు స్వాధీనం
మండల కేంద్రమైన గోనెగండ్లలోని నీలకంఠేశ్వర స్వామి, శ్రీ చింతలాముని స్వామి దేవాలయాల్లో మార్చి 22న హుండీలను పగులగొట్టి నగదు చోరీ జరిగింది. గో నెగండ్ల పియస్. Cr.No: 91/2021 & 92/2021 U/sec 457, 380 IPC గా నమోదు చేయబడినది. ఈ కేసులో.. కర్నూల్ డిఎస్పీ K. V మహేశ్ , సిసియస్ డిఎస్పీ ఎ. శ్రీనివాసులు ఆధ్వర్యం లో కోడుమూర్ సిఐ V శ్రీధర్ పర్యవేక్షణ లో గోనెగండ్ల ఎస్సై C. శరత్ కుమార్ రెడ్డి పోలీసు సిబ్బంది కలిసి సదరు కేసు లో దర్యాప్తు బృందాలుగా ఏర్పడి ఈ రోజు (30.03.2021) ఉదయం 7.30 గంటలపుడు బైలుప్పల గ్రామ సమీపం లో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో కడప జిల్లా ఒంటి మిట్ట మండలం, మాధవరం గ్రామానికి చెదిన నాగలూరు ఆదినారాయణ, నాగలూరు జానయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆలయంలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ, 36, 448/-, ఒక మోటార్ బైక్ AVENGER AP-04-AR-9166 ను కూడా స్వాధీనం చేసుకున్నాము.
హాలహర్వి దేవాలయాల్లో.. చోరీ ..
హాలహర్వి మండలం బొలగొట్ట గ్రామ శివార్లలోని బోలగోటి బసవేశ్వర స్వామి ఆలయం లో మార్చి 21న మూడు హుండిలను పగులగొట్టి అందులో ఉన్న నగదు ను, స్వామి వారికీ అలంకరించు వెండి ఆభరణములు , పంచలోహ ఆభరణములను దొంగిలించబడిన విషయమై హాలహర్వి పియస్. Cr.No: 116/2021 U/sec 457, 380 IPC గా నమోదు చేయబడినది. ఈ కేసుకు ఆదోని డిఎస్పీ శ్రీ. కె. ఎస్ వినోద్ కుమార్ , సిసియస్ డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యం లో ఆలూరు సిఐ . వి. భాస్కర్ పర్యవేక్షణ లో హాలహర్వి ఎస్సై S. నరేంద్ర , పోలీసు సిబ్బంది కలిసి సదరు కేసు లో దర్యాప్తు బృందాలుగా ఏర్పడి మార్చి 30న ఉదయం 8 గంటలక చింతకుంట గ్రామ సమీపంలో ఇద్దరి అరెస్టు చేశారు.కడప జిల్లా ఒంటి మిట్ట మండలం మాధవరం గ్రామానికి చెందిన నాగలూరు చిన్న వెంకటేష్, గురునాధం ఏడుకొండలు @ వేణును అదుపులోకి తీసుకొని విచారించగా, ఆలయంలో దొంగతనము చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని నుండి దొంగిలించిన క్రింది సొత్తు, నగదు ను స్వాధీనం చేసుకోవడమైనది. ఈ కేసులో 70 గ్రాముల పంచలోహ ఆభరణములు ( రెండు కను బొమ్మలు, నుదిటి పై ఉండే నామాలు, 2 కళ్ళు, ముక్కు, మీసాలు, నోరు) 80 గ్రాముల వెండి ఆభరణములు (2 కను బొమ్మలు, నుదిటి పై ఉండే నామాలు, 2 కళ్ళు, ముక్కు, మీసాలు, నోరు) CC కెమెరాలు రికార్డు చేసిన డేటా స్టోరేజ్ బాక్స్, ఒక మౌస్ మరియు కరెంటు వోల్టేజ్ స్విచ్ బాక్స్. నగదు Rs. 64,400/- , నేరము కు ఉపయోగించిన మోటార్ బైక్ TVS XL 100 (AP-39-GT-9171)ను కూడా స్వాధీనపరచుకోవడమైనది.
గూడురులో… ఇంటి దొంగ…
గూడురు పట్టణంలోని కోటాస్ర్టీట్లో నివాసం ఉంటున్న షేక్ నజీర్ అహ్మద్ నివాసంలో మార్చి 15 నుంచి 18వ తేదీ మధ్యన చోరీ జరిగినట్లు 18వ తేదీన రాత్రి 11గంటలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంటి తలుపులు , బెడ్రూం తలుపులు పగులగొట్టి , ప్లాస్టిక్ టబ్బులోని రూ.17 లక్షలు దొంగలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కోడు మూరు సిఐ శ్రీధర్ , గూడురు ఎస్సై నాగర్జున గూడూరు క్రైమ్ నెంబర్ 73/2021 u/sec 457, 380 ఐపిసి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కర్నూలు ట్రాఫిక్ పోలీసు వారి ఇచ్చిన 0589 అనే టాప్ నెంబర్ గల ఆటో లో దొంగలించిన వ్యక్తి కర్నూలు వైపు వెళ్ళినాడని, సాక్షుల విచారణలో తెలిసింది.
మూడు బృందాలుగా ఏర్పడి…
మూడు బృందాలను ఏర్పాటు చేసి ఈ ఆటో ను వెతికే విషయంలో మంగళవారం ఉదయం 8 గంటలకు కర్నూలు బళ్ళారి చౌరస్తాలో సదరు ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ అయిన నారాయణ రెడ్డిని విచారించగా ముద్దాయి ఎమ్ డి షఫీ అలియాజ్ జహాంగీర్, అలియాజ్ టిల్లు (45) s/o. ఇసామియా సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రం గుడిపాడు గ్రామం దగ్గర అరెస్టు చేసి అతని నుండి 16 లక్షల నగదు , 35 వేల వెండి పట్టీలు, ఒక సెల్ ఫోన్ రికవరి చేయబడినది. తదుపరి విచారణలో ముద్దాయి గద్వాల, పెబ్బెరు, తెలంగాణ ప్రాంతాలలో దాదాపు 10 దొంగతనాలు చేసినట్లు తెలుపగా, అతనిని సోదా చేసినప్పుడు 16 లక్షల నగదు, 35 వేల విలువ చేసే 2 జతల వెండి పట్టీలు, 13 వేల విలువ చేసే 1 వివో మొబైల్ స్వాధీనం చేసుకున్నాము. అంతేకాక తెలంగాణ ప్రాంతంలోని కేసులకు సంబంధించి సుమారు 10 తులాలు బంగారు కాయిన్ మరియు 18.50 తులాల బంగారం నగలు అతని వద్ద లభించినవి. తెలంగాణ పోలీసులకు సంప్రదించి వారికి సంబంధించిన కేసులలోని ప్రాపర్టీని కోర్టు ద్వారా వారికి అందజేస్తామని జిల్లా ఎస్పీ కాగినెల్లి డా. ఫక్కీరప్ప వెల్లడించారు.
ఈ ప్రెస్ మీట్ లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మధుసుధనరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, ఆదోని డిఎస్పీ శ్రీ వినోద్ కుమార్, కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్, డోన్ డిఎస్పీ నరసింహా రెడ్డి, సిఐలు, ఎస్సైలు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.