సామూహిక కుంకుమార్చనలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో చతుర్థ వార్షికోత్సవము, మరియా శ్రీ రాజశ్యామల నవరాత్రుల సందర్భంగా శ్రీ మహా గౌరీ అమ్మవారికి ఉదయం విశేష మంగళ ద్రవ్యములతో అభిషేకము జరిగినది. శ్రీ మహా గౌరీ అమ్మవారిని స్వర్ణ కవచముతో అనగా బంగారు చీరతో అలంకరించి విశేషార్చనలు లఘుశ్రీ చక్రార్చన, శ్రీ రాజశ్యామల సహస్రనామార్చనలు. సామూహిక కుంకుమార్చనలు జరిగినవి. భక్తులు అమ్మవారి పూజలో పాల్గొని, అనంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించి మహా గౌరీ అమ్మవారి కృపకు పాత్రులైనారు.
