NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరంలో సుందరీకరణ పనులు ..కలెక్టర్​ పరిశీలన

1 min read

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

నాణ్యతతో, త్వరగతిన పనులు పూర్తి చేయాలి..

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం తంగెళ్లమూడి నాలుగురోడ్ల సెంటరులో నిర్మిస్తున్న వాటర్ ఫౌంటేన్ ఇతర నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చే సుందరీ కరణ పనులలో నాణ్యత పరిణామాలు కూడా పాటించాలని, ఎక్కడ రాజీ పడలేదని అధికారులకు ఆదేశించారు. ఏలూరు నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపధికన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.   కలెక్టర్ వెంట నగరపాలక కమీషనరు సంక్రాంతి. వెంకటకృష్ణ తదితర అధికారులు ఉన్నారు.

About Author