వైసీపీ నేత పై కలెక్టర్ సీరియస్ !
1 min readపల్లెవెలుగువెబ్ : విశాఖపట్నం పెందుర్తి మండలం వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కిరణ్ సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. కిరణ్‌ని భూ కబ్జాదారుడిగా పేర్కొంటూ సీపీకి కలెక్టర్ మల్లికార్జున లేఖ రాశారు. కిరణ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేకంగా లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. కిరణ్ తో పాటు దాడికి పాల్పడిన 20 మందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లేఖలో తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ లేఖలో వివరించారు.కిరణ్ గ్యాంగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడి చేసిన వైసీపీ నేత ప్రస్తుతం పరారీలో ఉన్నారు.