PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ పనుల అమలు పై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

1 min read

– వచ్చే వారానికి లేబర్ మొబిలైజేషన్ 100 శాతానికి చేరాలి

– టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఇళ్ళ నిర్మాణాల పురోగతిలో  ఒక రోజు కూడా జీరో ఉండకూడదని  జిల్లా కలెక్టర్ డా.సృజన  సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఉదయం ఎంపిడిఓలు, హౌసింగ్ ఇంజనీర్ లతో ఇళ్ళ నిర్మాణాల పురోగతి, ఉపాధి హామీ పనుల అమలు పై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  మూడు మండలాల నుండి బిలో బేస్మెంట్ లెవెల్ నుండి బేస్మెంట్ లెవెల్  స్టేజ్ కన్వర్షన్ లో  ఎలాంటి పురోగతి లేదన్నారు.. బిలో బేస్మెంట్ లెవెల్ నుండి బేస్మెంట్ లెవెల్  స్టేజ్ని మొదటి ప్రాధాన్యత గా తీసుకోవాలని, ఇళ్లు మొదలు పెట్టని  వారిని మోటివెట్ చేసి ఇళ్ళ నిర్మాణం మొదలు పెట్టేలా  మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.   పురోగతి సాధించని కర్నూలు, చిప్పగిరి, కౌతాళం మండల అధికారులతో మాట్లాడుతూ స్టేజ్ కన్వర్షన్ పనులకు సంబంధించి ఒక్క రోజు కూడా 0 నమోదు అవ్వకుండా ఖచ్చితంగా పురోగతి ఉండేలా చూసుకోవాలన్నారు. ఆలూరు, నందవరం, ఆస్పరి, ఆదోని అర్బన్ మండలాల్లో కూడా పురోగతి లేదని,  స్టేజ్ కన్వర్షన్ పనుల్లో 0 నమోదు అవ్వకుండా చూసుకోవాలన్నారు. 11,646 ఇళ్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో భాగంగా   11282 ఇళ్లు పూర్తి చేశారని, 364 ఇళ్లు  మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.   10 మండలాల్లో 99 శాతం  ఇళ్లు పూర్తి చేశారని, ఆ మండలాలకు సంబంధించి 1,2 ఇళ్లు మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని,  ఆ ఇళ్లను రెండు రోజుల్లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు. కోడుమూరు, గూడూరు ల్లో పురోగతిలో వెనుక బడి ఉన్నారని, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు..విధుల్లో నిర్లక్ష్యం చూపిన కారణంగా కోడుమూరు మండల హౌసింగ్ ఏ ఈ ని సస్పెండ్ చేశామని, అతని స్థానంలో ఇంఛార్జి ని నియమించాలని కలెక్టర్ హౌసింగ్ పి డి  వెంకట నారాయణ ను ఆదేశించారు..  కోడుమూరు మండలంలో పూర్తి చేయాల్సినవి 5 ఉన్నప్పటికీ కూడా పురోగతి లేదని, ఇంఛార్జి ఎఈ తో కలిసి పురోగతి సాధించాలని ఎంపిడిఓ ని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి హోలగుంద, కోడుమూరు, తుగ్గలి మండలాలో 85 శాతం కంటే తక్కువ లేబర్ ని మొబిలైజ్ చేశారని, వచ్చే వారానికి లేబర్ మొబిలైజేషన్ 100 శాతానికి తీసుకొని వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడివో లను ఆదేశించారు.  లేబర్ పని చేసే ప్రదేశాల్లో ఎక్కడైనా షేడ్ లు ఏర్పాటు చేయకుండా ఉంటే  ఏర్పాటు చేయించాలని, రాబోయే మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, కూలీలు ఇబ్బంది పడకుండా  త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి అమర్ నాథ్ రెడ్డి ని ఆదేశించారు.. అదే విధంగా ఎఎన్ఎమ్, ఆశా వర్కర్లను కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు.నందవరం మండలంలో ఈ నెలలో 17 రోజులకు గాను 35 శాతం పనులు మాత్రమే  కల్పించారని,  అలాగే ఎమ్మిగనూరు మండలంలో 37 శాతం ఉపాధి పనులు కల్పించారని ఈ రెండు మండలాలు ఇప్పటివరకు  తక్కువగా పనులు కల్పించారని, ఈ నెల చివరి నాటికి 100 శాతం పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంపిడిఓ లను ఆదేశించారు.టెలికాన్ఫరెన్స్లో హౌసింగ్ పిడి, డ్వామా పిడి, మండల స్థాయి అధికారులు  పాల్గొన్నారు.

About Author