ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి కి కలెక్టర్ సాదర స్వాగతం
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన అనంతరం తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ప్రత్యేక అధికారి కె. ఆమ్రపాలి కి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం పూలమొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని ప్రత్యేక అధికారి ఆమ్రపాలి అడిగి తెలుసుకున్నారు. జిల్లాను వ్యవసాయపరంగానే కాక పారిశ్రామికంగా రాష్ట్రస్థాయిలో అభివృద్ధిపధంలో నిలిపేందుకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా అధికారి మరియు ప్రత్యేక అధికారి కలిసి చర్చించారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అనువైన అంశాలు, కొల్లేరు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాలలో పర్యాటకంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్ధేందుకు తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్ వెట్రిసెల్వి తో ఆమ్రపాలి చర్చించారు.