PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చోదిమెళ్ళలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: జిల్లాలో త్వరలో ప్రారంభించబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన  తేమ యంత్రం, కంప్యూటర్, కంటాలు, గోనెసంచులు తదితర పరికరాలు పని చేస్తున్నాయా.. లేదా.. అని స్వయంగా పరిశీలించారు .రైతు ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి వచ్చినప్పుడు  సిబ్బంది ఏమి చెయ్యాలి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతు తన ధాన్యం అమ్ముటకు వచ్చినప్పుడు గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు తీసుకువచ్చిన  నమూనా ధాన్యంను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా  ఉందొ లేదో పరిశీలించి రైతు వివరాలు నమోదు చేసిన  రైతుకు కొనుగోలు తేదీతో రసీదు ఇవ్వడం జరుగుతుందని సిబ్బంది తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ నిమిత్తం జిల్లాలో ధాన్యం పండించే  ప్రాంతాల్లోని 874 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఆర్ బి కె గ్రామ వ్యవసాయ సహాయకులను ధాన్యం సేకరణ కేంద్రానికి ఇన్చార్జిగా నియమించామన్నారు.
కొనుగోలు చేసేటప్పుడు…
ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు 17 శాతం  వరకు తేమ ఉంటే కొనుగోలు చేయడం జరుగుతుందని  అన్నారు. ధాన్యం సాధారణ రకం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1940,75 కేజీలకి రూ 1455, 40 కేజీలకి 776 ,ఏ గ్రేడ్ రకం క్వింటాల్ కు  రూ.1960,75 కేజీలకి రూ 1470,40 కేజీలకి రూ.784 చెల్లించడం జరుగుతుందని వివరించారు. అనంతరం ఆర్ బి కే లో ఉన్న రైతులతో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్( రెవెన్యూ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,పౌరసరఫరాల శాఖ డియండి. రాజు,వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగ్గారావు, డిఆర్ డిఎ పీడీ శ్రీనివాసులు,ఏలూరు ఆర్డీఓ శ్రీమతి పనబాక రచన,తాసిల్దార్ సోమశేఖర్,పౌరసంబంధాల శాఖ ఏడి,వ్యవసాయ శాఖ ఏవో,టెక్నికల్ అసిస్టెంట్,వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

About Author