11న కలెక్టరేట్ లో జగనన్నకు చెబుదాం -స్పందన కార్యక్రమం
1 min read
మండల, డివిజన్,మునిసిపల్ కార్యాలయాల్లో కూడా జగనన్నకు చెబుదాం స్పందన ..ప్రజల నుండి వినతుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 11 వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
