విద్యుత్ ఉద్యోగుల ఆందోళనతో దద్దరిల్లిన కలక్టరేట్..
1 min read– విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
– వేలాదిగా పాల్గొన్న విద్యుత్ ఉద్యోగులు
– ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల పరిష్కరించే వరకు పోరాటం ఆగదు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక కలక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, విద్యుత్ సంస్థలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, ఇపీఎఫ్ నుండి జిపిఫిఫ్ కు మార్చాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతరం ఒక ప్రైవేటు కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ ఉద్యోగుల తమ డిమాండ్లను పరిష్కరించుకునే విధంగా ఏకతాటి పైకి వచ్చారు. బుర్రకథ కళాకారులచే వినూత్న రీతిలో విద్యుత్ ఉద్యోగుల సాధకబాదాలను, డిమాండ్లను వినూత్న తరహాలో వినిపించారు. ఇది అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఆకట్టుకునే విధంగా ఉంది.