PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలెక్టర్​ సమావేశం

1 min read

– జిల్లా ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్ లో అదనంగా టమోటా, ఉల్లి పంటలను చేర్చండి : జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు : జిల్లాలోని పంటల ఎగుమతికి సంబంధించి పత్తి, మిరప, చిరుధాన్యాలతో పాటు టమాటా మరియు ఉల్లిని కూడా అదనంగా చేర్చాలని ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్ లో చేర్చాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పరిశ్రమల శాఖ జిఎమ్ ను ఆదేశించారు.శనివారం సంబంధిత శాఖల అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంట ఎగుమతికి సంబంధించి పత్తి, మిరప, చిరుధాన్యాలతో పాటు టమోటా మరియు ఉల్లిని కూడా అదనంగా చేర్చాలని, ఇందుకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ కింద 14 యూనిట్లకు (ఎస్సీ 13, ఎస్టీ 1) రూ.1,00,22,573 మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.సింగిల్ డెస్క్ పోర్టల్ క్లియరెన్సెస్ కింద 12 దరఖాస్తులు రాగా అనుమతులు 5 మంజూరు అయ్యాయని, ఇంకా 7 దరఖాస్తులు ప్రాసెసింగ్ లో ఉన్నాయని పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ రెడ్డి వివరించ గా, అనుమతుల మంజూరులో సంబంధిత శాఖల అధికారులు జాప్యం చేయరాదని కలెక్టర్ సూచించారు..ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద పెండింగ్ లో ఉన్న 38 దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ LDM వెంకట నారాయణ కు సూచించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ రెడ్డి, ఇలా చైర్మన్ రామకృష్ణారెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, నాబార్డ్ ఏజీఎం పార్థావ, ఫిషరీస్ జెడి, ఏపీఎంఐపి పిడి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, ఏపీఐఐసీ జెడ్ ఎం విశ్వేశ్వరరావు, మార్కెటింగ్ ఏడి, ఎల్ డి ఎం వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author