PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 న మిడుతూరులో కలెక్టర్ స్పందన…

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఈనెల 10వ తేదీ శుక్రవారం స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.ఈ స్పందన కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పందన కార్యక్రమానికి వస్తున్నారని స్వయంగా వారే ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారని తెలిపారు.మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న వెలుగు పొదుపు లక్ష్మి మహిళా మండలి సమాక్య ప్రాంగణంలో స్పందన ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు.మండలంలో ఉన్న ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లకుండా ప్రతి మండలంలో కూడా స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తున్నారని కావునా మండల ప్రజలు మీకు ఉన్న సమస్యల గురించి అర్జీల రూపంలో కలెక్టర్ కు అందజేసినట్లయితే మీ సమస్యలకు పరిష్కారం అవుతాయని ఎంపీడీవో తెలిపారు.మండలంలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అంతేకాకుండా మండల అధికారులు,పంచాయితీ కార్యదర్శులు, వీఆర్వోలు తదితర అధికారులు తమ పూర్తి నివేదికలతో స్పందన కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు.

About Author