రెండు రాష్ట్రాలను కలుపుతా అంటే కేసీఆర్ కు మద్దతిస్తా !
1 min readపల్లెవెలుగు వెబ్ :టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్ లో చిట్ చాట్ చేశారు. సమైక్య రాష్ట్రం పేరు మీద ఏపీ, తెలంగాణ అధికార పార్టీలు కొత్త డ్రామా స్టార్ట్ చేశాయని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలే అప్పడు తాను అన్నానని చెప్పారు. కేసీఆర్ రాజకీయాలు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలను కలుపుతా అంటే కేసీఆర్ కు మద్దతు ఇస్తానని అన్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని కూడ ఇదే విషయం చెప్పారని అన్నారు. తాను మొదటి నుంచి సమైక్య రాష్ట్రానికి అనుకూలమేనని అన్నారు.