NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయంతో..తిరిగి రండి …

1 min read

16 నుంచి  జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలు

  • బాక్సర్లను అభినందనలు తెలిపిన డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​

కర్నూలు, న్యూస్​ నేడు: చత్తీస్​ ఘట్​ రాష్ట్రం రాయపూర్​లోని సింగ్​ జంజా ఇండోర్​ స్టేడియంలో  ఈ నెల 16 నుంచి  20వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​ సూచించారు. ఏప్రిల్​ 5,6వ తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన కిక్​ బాక్సింగ్​ పోటీలో విజయం సాధించిన బాక్సర్లు…  జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూల్ నుంచి సుజిత్,హరి కళ్యాణ్, అశోక్,రింగు విభాగంలో , తతామి విభాగంలో  జయ కళ్యాణ్, ఉపేంద్ర ఉప్పరి, హరిచంద్ర ప్రసాద్, మురళి మోహన్, కోచ్ మహేష్ రెఫరీగా నరేంద్ర ఆచారి చత్తీస్​ గడ్​ రాయపూరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో  పాల్గొననున్నారు.  ఈ సందర్భంగా  ఆదివారం కిక్​ బాక్సర్ల ను డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​  అభినందించారు. పోటీలో కర్నూలు సత్తా చాటి.. పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.  క్రీడల్లో కర్నూలు జిల్లాకు, ఏపీకి మంచి పేరు తీసుకురావాలని సూచించిన డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​.. పోటీలో పాల్గొనేందుకు  ఆర్థిక సాయం చేసి…  క్రీడాకారులకు ఆల్​ ది బెస్ట్​ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *