NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద‌మ్ముంటే రండి… మా స‌త్తా ఏంటో చూపిస్తాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముంబైలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆజాన్‌, లౌడ్‌స్పీకర్‌ వివాదాలు నడుస్తున్న వేళ.. ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు, సీఎం ఉద్దవ్‌ థాక్రేను హనుమాన్‌ జయంతి నాడు హనుమాన్‌ చాలీసా పఠించాలంటూ సవాల్‌ విసిరారు. లేకుంటే.. తాము మాతోశ్రీ ఎదుటకు వచ్చి హనుమాన్‌ చాలీసా పఠిస్తామంటూ పేర్కొన్నారు. దీనిపై ఉద్దవ్‌ థాక్రే ముఖ్యఅనుచరుడు సంజయ్‌ రౌత్‌ స్పందించాడు. ఎవరైనా మాతోశ్రీని చేరుకునే ప్రయత్నాలు చేసినా చూస్తూ ఊరుకోవద్దంటూ శివ సైనికులకు సూచించాడు. ‘‘అలా చేస్తూ చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? దమ్ముంటే రండి. మా సత్తా ఏంటో చూపిస్తాం. మీ భాషకు మీ భాషలోనే సమాధానం ఎలా ఇవ్వాలో శివ సైనికులకు బాగా తెలుసు. బీజేపీ అండతో ఆమె(నవనీత్‌కౌర్‌ను ఉద్దేశించి) రెచ్చిపోతున్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉంది’’ అంటూ స్పందించాడు.

                                        

About Author