22న కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు తరలి రండి
1 min read– ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని సమస్యలపై, ఉపాధిలో పోరాడి సాధించుకున్న హక్కులను, సౌకర్యాలను నీరుగార్చ్తు తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నాకు జిల్లాలోని ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి, వీరశేఖర్, కె.వి. నారాయణలు పిలుపునిచ్చారు. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం దేవనకొండ మండల కేంద్రంలోని స్థానిక సి ఎల్ ఆర్ సి భవన్ లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ అధ్యక్షతన జరిగిందిి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి నారాయణ మాట్లాడుుతూ, దేశంలో వలసలు నివారణ, పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కొరకు సుదీర్ఘంగా పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పనికి భారీగా నిధులు కోత పెడుతున్నారని అన్నారు. పేదలకు అన్నం పెడుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కోతలు పెడుతున్నారని పేర్కొన్నారు. గతంలో లక్ష కోట్లకు పైగా ఉన్న బడ్జెట్ను ఈ సంవత్సరం కేవలం 69 వేల కోట్ల కుదించారని ఈ నిధులలో కూడా అనేక నిబంధనలు చేర్చి గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు అరకొరగా నిధులు కేటాయించారని అన్నారు. అదేవిధంగా గతంలో వేసవి అలవెన్సు, తాగునీటి అలవెన్స్, రవాణా, గడ్డపార అలవేన్సులు ఉండేవని, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ కోత పెట్టిందని పేర్కొన్నారు సాంకేతికత పేరుతో, రెండు పూటల హాజరు పేరుతో ఉపాధి పనిని ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు, అడవి ప్రాంతాలలో నెట్వర్క్ లేని సందర్భంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో 200 రోజుల పని 600 రూపాయల వేతనం, అడిగిన వారందరికీ పని ,కొత్త జాబ్ కార్డులో మంజూరు మరియు ఉపాధి సమస్యలపై ఈనెల 22వ తారీఖున మహా ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తుందని కూలీలంతా ఈ కార్యక్రం పాల్గొనాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, బాలకృష్ణ ,జిల్లా నాయకులు శ్రీరాములు, దస్తగిరి , మహబూబ్ బాషా, యూసుఫ్ భాష ,రంగరాజు, దేవేంద్ర, కొండయ్య, రామాంజనేయులు రమేష్ నాగేష్ లింగన్న తదితరులు పాల్గొన్నారు.