కురవల కార్తీక వన మహోత్సవానికి తరలిరండి
1 min read
పల్లెవెలుగు, వెబ్ పత్తికొండ: ఈనెల 13న కర్నూలులో కురువ సంఘం తలపెట్టిన కురువల కార్తీక వనభోజన మహోత్సవానికి జిల్లాలోని కురువ సహోదరులంతా తరలి రావాలని కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం ఆయన స్వగృహంలో కురువ సంఘం సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి జీవితం యాంత్రికంగా మారిన నేపథ్యంలో కాస్తంత ఉపశమనం కోసం కురువ సంఘం కర్నూలులోని రాజీవ్ గృహకల్ప ఎదురుగా వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి ప్రాంగణంలో కురువ 20వ కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పచ్చని తోటలు, పువ్వుల గుబలింపుల ప్రకృతి రమణీయత మధ్య కురువ సహోదరులంతా ఒకచోటకు చేరి ఒకరినొకరు ఆత్మీయ ఆదరాభిమానాలతో మనసు విప్పి పలకరించుకుంటూ చిన్నారుల ఆటపాటలతో, కార్తీక వనభోజనం మహోత్సవాన్ని జరుపుకుందామని అన్నారు. కావున ఉరువల కార్తీక వనభోజనం మహోత్సవానికి కురువలంతా కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఈ సమావేశంలో పత్తికొండ నియోజకవర్గ స్థాయి కురువలు పాల్గొన్నారు.