NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా కామ్రేడ్స్ ఈశ్వర్ రెడ్డి, టీ షడ్రక్ ల వర్ధంతి               

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం స్థానిక పత్తికొండ పట్టణంలో కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి భవనం నందు రైతు సంఘం మండల అధ్యక్షులు పుచ్చకాయల మాడ రాముడు అధ్యక్షతన జరిగిన కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి, టీ షడ్రక్ ల వర్ధంతి మహాసభలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షులు కాశీ విశ్వనాథ్,  PNM మండల కార్యదర్శి రమేష్, ఆవాజ్ మండల కార్యదర్శి తాజ్ మహమ్మద్ లూ కామ్రేడ్స్ ఈశ్వర్ రెడ్డి        టీ. షడ్రక్ లు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి వర్ధంతి సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్తికొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి గారు పత్తికొండ ప్రజలకు ఎనలేని సేవలకు కృషి చేశారని, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పత్తికొండ తాలూకా నందు ప్రజలు అందరి మన్నలు పొందారని  తెలిపారు. కామ్రేడ్ టి. షడ్రక్ గారు కర్నూలు జిల్లా కేవీపీఎస్ వ్యవస్థాపకులు వివక్ష అంతం పోరు పాఠం నేర్పిన వీరుడనీ అన్నారు. అలాంటి వారి సామాజిక స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని, వారి ఆశయాలను ఆదర్శంగా  తీసుకోవాలని పిలుపునిచ్చారు. పాతకాలపు భావజాలాన్ని కొనసాగించే మనువాద మతోన్మాదాన్ని లాల్ నీల్ శక్తుల ఐక్యత ద్వారానే తిప్పి కొట్టగలమని ఆచరించి చూపిన ఆచరించి చూపిన  దార్శనికుడు అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మధు, ఏఎన్ఎం చైతన్య తదితరులు పాల్గొన్నారు.

About Author