సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అంగన్వాడి సూపర్వైజర్లు వరలక్ష్మి,పి.రేణుకా దేవి ఆధ్వర్యంలో చేపట్టారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా ఎంపీటీసీ తువ్వా.అన్నపూర్ణమ్మ,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు హాజరయ్యారు.ఇప్పటివరకు అంగన్వాడి కేంద్రాలలోనే భోజనాలు చేసి మహిళలకు ఇచ్చేవారని ఇప్పటి నుండి కేంద్రాలలో కాకుండా వారి ఇంటి దగ్గరికే కిట్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉందని ఈపోషణ కిట్ల ద్వారా శిశు మరణాలను తగ్గించే విధంగా అంగన్ వాడీ కార్యకర్తలు చూడాలని అంతేకాకుండా ప్రతి నెలా ప్రతి ఒక్కరికి కిట్లు అందే విధంగా చూడాలని ఎంపీడీవో మరియు తహసిల్దార్ అన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.ఇప్పటివరకు అంగన్వాడి కేంద్రాలలోనే గర్భవతులు మరియు బాలింతలకు భోజనాన్ని ఇచ్చే విధంగా ఉండేదని ఇప్పుడు అలా కాకుండా వారి ఇంటికే పోషణ కిట్లను పంపించడం జరుగుతూ ఉందని సంపూర్ణ ఈపోషణ కిట్లలో బియ్యం,కందిపప్పు, నూనె,గుడ్లు-13,పాలు వైయస్సార్ కిట్లలో అటుకులు,రాగి పిండి-2 కేజీలు,చిక్కీలు,ఖర్జూర,బెల్లం ఈరెండు టికెట్లను బాలింతలకు,గర్భవతులకు ప్రతినెల 1వ తేదీన ఆయా గ్రామాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో కార్యకర్తలు పంపిణీ చేస్తారని సూపర్వైజర్లు వరలక్ష్మి,రేణుక దేవి అన్నారు.బుధవారం రోజున మండలంలోని అన్ని గ్రామాలలో ఈపోషణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం కిట్లను బాలింతలు మరియు గర్భవతులకు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.